ముద్ర :మల్కాజిగిరి:
సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన త్యాగాలు తరతరాలకు ఆదర్శమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మరిది రాజశేఖర్ రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని యాదవ్ నగర్‌లో గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా, ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి గౌడ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి, పాపన్న గౌడ్ సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘ సభ్యులు మల్లేష్ గౌడ్, వెంకట్ నరసయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మురుగేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు జేసి వెంకన్న, రాము యాదవ్, వెంకటేష్, చిన్న యాదవ్, చంద్రశేఖర్, నాగరాజు, ఏడుకొండలు తదితరులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.