Take a fresh look at your lifestyle.

గద్వాలలో చికెన్ షాపులు బంద్…

 

ముద్ర,గద్వాల:

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో చికెన్ షాపుల బంద్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో చికెన్ షాపులను బంద్ చేసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యజమానులు మాట్లాడుతూ…పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1.8 గా ఉన్న మార్జిన్ను ప్రస్తుతం 1.5కి తగ్గించడమే ఈ బంద్కు ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు.

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ బంద్ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యజమానులందరూ ఈ బంద్లో పాల్గొని, దీనిని విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మార్జిన్ పెంపుపై పౌలీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా హెచ్ఛరించారు. అనంతరం హైదరబాద్ లో జరిగే ధర్నాకు షాప్స్ యజమానులు తరలివెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.