Take a fresh look at your lifestyle.

500 మెగావాట్స్ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ ను సందర్శించిన సింగరేణి డైరెక్టర్ (ఈ&ఏం) డి.సత్యనారాయణ రావు

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ&ఏం) డి.సత్యనారాయణ రావు ముతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనిని సందర్శించి త్వరలో మేడిపల్లి ఉపరితల గనిలో 500 మెగావాట్స్ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్” నిర్మించనున్న సంబందించి చేపట్టవలసిన పనుల గురించి అధికారులతో చర్చించారు.ప్రాజెక్ట్ కు సంబందించిన ఫిజికల్ రిపోర్ట్, డిటైల్డ్ ప్రాజేక్ట్ రిపోర్ట్ లను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు.ఇట్టి ప్రాజెక్ట్ నిర్మానంకు సంబందించిన పలు విషయాల గురించి “వ్యాప్కోస్ సంస్థ” తో చర్చించటం జరిగింది. ప్రాజెక్ట్ కు సంబందించిన మ్యాపులను పరిశీలించారు.ఇది సింగరేణి లోనే మొట్ట మొదటి సారిగా ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్న “500 మెగావాట్స్ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్” ప్రాజెక్ట్ అని ఇందుకు సంబందించిన పనులను త్వరిత గతిన పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. ఇట్టి ప్రాజెక్ట్ పూర్తీ అయితే కంపెనికి ఇది ఒక గొప్ప విజయం అని రానున్న రోజులలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లనిర్మాణంలో కీలక మలుపుగా అభివర్ణించారు.రానున్న రోజులలో పోటి దృష్ట్యా సింగరేణి సంస్థ ద్వారా బొగ్గు ఉత్పత్తే కాకుండా థర్మల్ విధ్యుత్, సోలార్ విధ్యుత్, విండ్ ఎనర్జి తో పాటు ముతబడిన ఉపరితల గనులలో పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ ల ద్వారా కుడా విద్యుత్ ఉత్పతి చేయుటకు ఇట్టి “500 మెగావాట్స్ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్” కీలకం అని అన్నారు. కాలానికి అనుగుణంగా కంపెని కుడా నూతన టెక్నాలజీ తో పోటి పడుతూ దేశం లోనే అత్యుత్తమ సంస్థగా ఏర్పాటు అవుతుందని అన్నారు.డైరెక్టర్ తో పాటు అర్జీ 1 జిఎం డి.లలిత్ కుమార్,ఇంచార్జ్ ఎస్ఓటు జిఎం ఆంజనేయ ప్రసాద్,ఏరియా ఇంజనీరు పి.రమేష్,కార్పోరేట్ అధికారులు, మురళీధర్, విశ్వనాథ్, ప్రభాకర్, శ్రీనివాస్ డిజిఎం ఏరియా వర్క్ షాప్ జితేందర్ సింగ్,సర్వే అధికారి లక్ష్మిరాజం,సివిల్ వసంత కుమార్, ఏరియా సేక్యురిటి అధికారి వీరారెడ్డి, మాల్లిఖర్జున్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.