Take a fresh look at your lifestyle.

కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్

  • నాలుగు లేబర్ కోడ్ ల వల్ల వేతన కమిటీ లు, కార్మిక సంఘాల ఉండవు.
  • జూలై 9 న దేశవ్యాప్త సమ్మె ను సింగరేణి లో జయప్రదం చేయండి.
  • జిడికె వన్ ఇంక్లైన్ గేట్ మీటింగ్ లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సమ్మె ను సింగరేణి లో జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏఐటియుసి మడ్డి ఎల్లా గౌడ్, ఐఎన్టీయుసి సదానందం, సిఐటియు మెండె శ్రీనివాస్, టిబిజికెఎస్ వడ్డెపెల్లి శంకర్, ఐఎఫ్టీయు కట్ట విశ్వనాథం లు కోరారు. శనివారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ లో జరిగిన ద్వారా సమావేశం లో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9 న జేఏసీ ఆధ్వర్యంలో జరుప తలపెట్టిన సమ్మెనువిజయవంతం చేయాలని,కేంద్ర ప్రభుత్వంవెంటనే నాలుగు లేబర్ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను యధావిధిగాఉంచాలని అన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇట్టి చట్టాలను రద్దు చేస్తూ 4 కోడు లుగా విభజించి కార్మిక చట్టాలు లేకుండా, కార్మిక సంఘాలు లేకుండా,వేతన కమిటీలు లేకుండా కార్మికులను కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బిజెపి ప్రభుత్వ2 కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేసుకొని, అనేక పోరాటాల ద్వారా 44 చట్టాలను సాధించుకోవడం జరిగిందని, వీటిని కాపాడుకోవడం కోసం ఈనెల 9 న జరుగు దేశ వ్యాప్త సమ్మెలో, సింగరేణిలో ఉన్న సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఓపెన్ కాస్ట్ ఓబి కార్మికులు యావత్తు సింగరేణి కార్మిక వర్గం ఈ సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమ్మె సందర్భంగా యాజమాన్యం కు ఇచ్చిన సమ్మె నోటీసు లో నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కొత్త గనులు కేటాయించాలని, సింగరేణి లో ప్రైవేటు కు ఇచ్చిన బొగ్గు బ్లాక్ లను కంపేనీకి ఇవ్వాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, స్వంత ఇంటి పథకం అమలు చేయాలని, తదితర డిమాండ్ లపై సమ్మె నోటీసు ను అందజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోషం, టిబిజికేఎస్ నాయకులు మాదాసు రాంమూర్తి, ఏఐటియుసి నాయకులు సంకె అశోక్, మానాల శ్రీనివాస్, సిర్ర మల్లికార్జున్ తో పాటు జేఏసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.