Take a fresh look at your lifestyle.

సన్నబియ్యం పథకం లోతుగా జనాల్లోకి తీసుకెళ్ళాలి

  • నిరుపేదల కడుపు నింపే మంచి కార్యక్రమం.
  • ఇప్పటికే ప్రజల నుంచి అద్భుతమైన స్పందన.
  • పార్టీ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ హితబోధ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : సన్న బియ్యం పథకాన్ని లోతుగా జనాల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయలేదని, ఇప్పడు కాంగ్రెస్ సర్కార్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టి పేదల కడుపు నింపుతోందని అన్నారు.ఇంత మంచి కార్యక్రమంపై బీఆర్ఎస్, బీజేపీ కడుపుమంటతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.మంచి ఫైన్ రైస్ బీఆర్ఎస్, బీజేపీ ఎప్పడైనా ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.ఈ మేరకు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పంపిణిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..2.8 కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇస్తూ, 10 వేల కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఇప్పడు 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వడానికి 13 వేల కోట్లు తాము ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో బీఆర్ఎస్ సరఫరా చేసిన దొడ్డు బియ్యం నాణ్యత సరిగా లేకపోతుండటంతో ఎవరు తినేవారు కాదన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీతో విప్లవాత్మక మార్పు ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పండని పంట ఇప్పుడు పండుతుందన్నారు.రికార్డుస్థాయిలో 66.7 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండిందన్నారు. తమ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.ధాన్యం కొనుగోలు అంశంలో కమిటెడ్‌గా ఉన్నామని, సరైన ధర కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఎంఎస్‌పీకి, బోనస్ కోసం కోట్లాది రూపాయల డబ్బును ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.