బోథ్, ముద్ర:
జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ ఇళ్ల స్థలాలను అందజేసింది. బోథ్ దళానికి చెందిన కొమరం సుశీల @ రూపక్క, కుంటాల/బోథ్ దళాలకు చెందిన కుమరం సక్కుబాయి @ వసంతక్కలకు ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడలో రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు అందజేశారు.అదేవిధంగా అల్లంపల్లి ఫైరింగ్ ఘటనలో మృతిచెందిన పీసీ జె. ముకుందరావు కుటుంబానికి మావల మండలం దుబ్బగూడా గ్రామంలో ఇంటి స్థలం పట్టా పాస్‌బుక్‌ను ఆయన భార్యకు అందజేశారు.ఇక విధుల్లో మృతిచెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు, ఆర్థిక సాయం అందించారు. ఏఆర్ హెచ్సీ ఆర్.దిగంబర్ కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయగా, ఎస్ఐపి పి. శివాజీ, రమణ రెడ్డి కుటుంబ సభ్యులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కల్పించారు.