Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవల దిశగా మరో కీలక అడుగు… శాసన సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు నాణ్యమైన మరియు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్మాణంతో జిల్లాలో వైద్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, పేద ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమవుతున్న ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు వైద్య విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించబడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, మాజీ ఎంపీపీ కోటయ్య, కౌన్సిలర్లు అనంత అలివేలమ్మ, నిజాం, ఆసిఫా బేగం ఖాదర్, మాధవి రాజు, శంకర్, నజీమా ఇస్టాక్ అహ్మద్ ఖాన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.