Take a fresh look at your lifestyle.

రైతు బజార్ లో బంగారు మైసమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..

భూమి పూజలో పాల్గొన్న మార్కేట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖబాబురావు, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ పట్టణంలోని రైతు బజార్ లో పునర్నిర్మాణం చేపట్టనున్న రే ణుక ఎల్లమ్మ, బంగారు మైసమ్మ దేవాలయల నిర్మాణానికి సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహాకారంతో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాల ఏర్పాటుతో పాటు, మన పూర్వీకుల ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నదని అన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందిస్తున్న సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాడూరి నరసింహ, రంగ క్రిస్టయ్య, చిన్నం శ్రీను, రైతు బజార్ సంఘం అధ్యక్షలు యట్టా నాగరాజు,ఎస్టేట్ అఫీసిసర్ సాయిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.