- జిల్లా కలెక్టర్ హనుమంత రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి
మట్టి గణపతులను ప్రతిష్ఠించడం వలన పర్యావరణం కాలుష్యం కాకుండా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణకు అందరము పాటుపడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. ఈనెల 27న వినాయక చవితి పండగను పురస్కరించుకొని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి ఆధ్వర్యంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ సహకారంతో జిల్లాకు సరఫరా చేసిన రెండు వేల వినాయక మట్టి ప్రతిమలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పూజలకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించి జల కాలుష్య నివారణకు సహకరించాలని అన్నారు. వివిధ రంగుల వినాయక ప్రతిమల ద్వారా వివిధ విష రసాయనాల వలన జలాన్ని శుద్ధి చేసే నీటిలోని క్రిమి కీటకాలు చనిపోయే ప్రమాదం ఉన్నందున విధిగా మట్టి ప్రతిమల ను వినియోగించి జల కాలుష్య నివారణకు కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమం రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు భాస్కరరావు, జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ వెంకన్న, బీసీ సంక్షేమ అధికారి సాహితి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్ సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.