Take a fresh look at your lifestyle.

నిమిషాంబ ఆలయంలో ఘనంగా సుమంగళి పూజలు

బోడుప్పల్, ముద్ర విలేకరి: శ్రావణ మాసం చివరి ఐదవ శుక్రవారం సందర్భంగా బోడుప్పల్ లోని శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో సుమంగళి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 60 సంవత్సరాలు పైబడిన సుమారు 200 మంది పెద్ద ముత్తయిదువులకు మహిళామణులకు సుహాసిని పూజ వాయినాలు ఇచ్చారు.

అమ్మవారి అన్న ప్రసాద – భోజనాలు ఏర్పాటు చేశారు., సాయంత్రం మహిళామణులచే సామూహిక మహా మంగళహారతి జరిపించారు. శ్రావణమాసం చివరి రోజు కావడంతో అశేష మహిళా మణులు అమ్మవారిని దర్శించుకోవడానికి మరియు మన తెలంగాణ సాంప్రదాయంలో అమ్మవారికి ఒడి బియ్యం పోయడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ మహిళలతో పూజలు చేపించారు. ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ట్రస్ట్ ధర్మకర్తలు :ఎస్. గౌరి శంకర్, డి. నర్సింగ్ రావు, బి. హిమచందర్, ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్ . రామకృష్ణ, వై. చంద్రశేఖర్, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చంద్రశేఖర్ శర్మ, అర్చకుడు శ్రీ ఉమకాంత్ శర్మ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.