Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆదేశాల అనుసారం మండల స్థాయి జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. పార్టీ కోసం శ్రమించి పని చేసే వారిని కమిటీలలో అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్ స్థాయి నుండి పై వరకు బలోపేతం చేయడానికి కృషి చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సహకారం అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గౌడ్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్, అప్పల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ , ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అవేజ్ ,ఎంబడి రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.