ముద్ర, ప్రతినిధి యాదాద్రి భువనగిరి :
ఎన్ఎంఎన్ఎస్ యాప్ తో కూలీల హాజరు నమోదు సులువవుతుందని డిఅర్ డిఓ టి. నాగిరెడ్డి అన్నారు. జిల్లాలోని వంగపల్లి రైతు వేదిక లో 6 మండలాలు , మాస్కుంట రైతు వేదిక లో 6 మండలాలు, చౌటుప్పల్ రైతు వేదికలలో 5 మండలాలకు సంబందించిన ఫీల్డ్ అసిస్టెంట్లు , టెక్నీకల్ అసిస్టెంట్లు , ఇంజనీరింగ్ కన్సల్టెంట్ లకు జరిగిన పేస్ అంతేంటికేషన్ యాప్ పై శిక్షణ ముగింపు కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూయాప్ వినియోగంతో పనులలో పారదర్శకత పెరుగుతుందని, హాజరు నమోదు ప్రక్రియ మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. అందరు ఫీల్డ్ సిబ్బంది యాప్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ సురేష్, ఏ పి డి నవీన్ పాల్గొన్నారు.