Take a fresh look at your lifestyle.

ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లు

  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సమాచార హక్కు చట్టం నూతన కమిషనర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన సీనియర్ జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, న్యాయవాదులు దేశాల భూపాల్, మోహిసినా పర్వీన్ బాధ్యతలు చేపట్టారు.రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా వయసు 65 ఏళ్లు నిండే వరకు వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కొనసాగుతారు. కాగా తెలంగాణలో గత కొంత కాలంగా ఆర్టీఐ కమిషన్ ఖాళీగా ఉంది.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో ఇటీవలే కమిషన్ నియామకాన్ని ప్రభుత్వంరాష్ట్ర సమాచార కమిషనర్లుగా నలుగురు ప్రమాణ స్వీకారం చేపట్టింది.

Leave A Reply

Your email address will not be published.