బండి సంజయ్ వేదికపైకి రాగానే దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్
జై శ్రీరాం నినాదాలతో మారుమోగిన పరేడ్ గ్రౌండ్
సంజయ్ ప్రసంగానికి కార్యకర్తలు ఫిదా
ముద్ర, హైదరాబాద్ :
పరేడ్ గ్రౌండ్ లో ఇద్దరు నేతలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాగా.. ఇంకొకరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ కు రాకకు 45 నిమిషాల ముందే బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్ కు విచ్చేశారు. అప్పటికే పరేడ్ మైదానమంతా పూర్తిగా జన సంద్రమైంది. వేదికపై మహామహులంతా ఉన్నారు. బండి సంజయ్ సభా వేదికపై రాగానే ఒక్కసారిగా సభలోని వేలాది మంది కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ నెలకొంది. ఈలలు, కేరింతలు, చప్పట్లతో విజిల్స్ వేస్తూ జై మోదీ.. జై బండి అంటూ నినదాలు చేయడంలో పరేడ్ మైదానమంతా మారుమోగిపోయింది. ఇక బండి సంజయ్ ప్రసంగం సైతం కార్యకర్తలను ఆకట్టుకుంది. జై శ్రీరాం నినాదంవల్ల తెలంగాణకు డబ్బులు రావడమే కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ గుండెల్లో రాళ్లు పడుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలతో పరేడ్ మైదానం మరోసారి దద్దరిల్లింది. నేను ఏనాడు బీజేపీకి తలవంపులు తేను… మీ తాటాకు చప్పళ్లకు భయపడేటోడిని కాదు. భయపెడితే భయపడటానికి మీ ఫాంహౌజ్ లో ఎలుకను కాదు.. అయ్యపేరు చెప్పి, ఆస్తులకు కూడగట్టుకునేటోడిని కాదు. ధర్మం కోసం పనిచేసే కాషాయ కార్యకర్తను. కాషాయ జెండా మోస్తున్న మోదీ సైనికుడిని.’’అంటూ చేసిన ప్రసంగంతో పరేడ్ మైదానమంతా పులకించిపోయింది.