Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికల ప్రభావం.. ఐపీఎల్ షెడ్యూల్‌పై బీసీసీఐ మౌనం

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వేలం ముగిసి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు టోర్నీ షెడ్యూల్ విడుదల కాలేదు. సాధారణంగా ఈ సమయానికి మ్యాచ్‌ల తేదీలు ప్రకటించాల్సి ఉండగా, బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆనవాయితీ ప్రకారం మార్చి నుంచి మే మధ్య టోర్నీ నిర్వహించే అవకాశమున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆలస్యానికి అసెంబ్లీ ఎన్నికలే కారణమని సమాచారం. బెంగాల్, తమిళనాడు, అస్సాంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అనిశ్చితి నెలకొంది. ఎన్నికల సమయంలో పోలీసులు విధుల్లో నిమగ్నమవుతారని, అదే తేదీల్లో మ్యాచ్‌లు ఉంటే వేదికల మార్పులు చేయాల్సి వస్తుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే ఐపీఎల్ తేదీలను ఖరారు చేస్తామని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే టోర్నీని రెండు దశలుగా నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. గత సీజన్‌లో RCB ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.