‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో తమిళ నటుడు రాధాకృష్ణన్ పార్తిబన్ వివాదంలో నిలిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తనను పరిచయం చేసుకుంటూ కులాన్ని ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ అంశంపై స్పందించిన పార్తిబన్, తాను ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడలేదని, అనుకోకుండా నోరు జారిందని తెలిపారు. తాను కులవ్యవస్థకు వ్యతిరేకినని స్పష్టం చేస్తూ, తన మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చి ఉంటే క్షమించాలని కోరారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉంటానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందే ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.