Take a fresh look at your lifestyle.

సాయిసిరికి గురుబ్రహ్మ జీవిత సాఫల్య పురస్కారం

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణానికి చెందిన ప్రధానోపాధ్యాయులు, సినీగీత రచయిత సాయిసిరికి రాష్ట్రస్థాయి గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన
సాయిసిరికి మదర్ తెరిసా సామాజిక సేవ సంస్థ విశాఖపట్నం వారు తెలుగు సాంస్కృతిక గీతాలను రాసి తెలుగు భాష సంస్కృతిక వైభవ వారధిగా నిలిచినందుకుగాను 2026 సంవత్సరం గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో అందించారు. మదర్ తెరిసా సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకృష్ణమూర్తి, వివిధ జిల్లాలో చెందిన ప్రముఖులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.