Take a fresh look at your lifestyle.

యువతీ యువకులు దేశభక్తి , ధర్మభక్తి అలవర్చుకోవాలి: ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యువతీ యువకులకు దేశభక్తి , ధర్మభక్తి అలవర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం జీనియస్ స్కూల్లో
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్టిత వ్యక్తుల సమావేశం జరిగింది. ముఖ్య వక్తగా విచ్చేసిన రమేష్ మాట్లాడుతూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, హిందూ సాంస్కృతిక జీవన విధాన గొప్పతనాన్ని , దేశ ప్రస్తుత సమకాలీన అంశాలను వివరించారు. పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని గురించి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ నల్గొండ విభాగ్ కార్యవాహ మంత్రిప్రగడ శ్రీధర్, జిల్లా సంఘచాలక్ బాదం ప్రకాష్, తాడేం పాండు, జగిల్లాపురం నాగరాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.