సహకరించిన సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు రాజ్యసభ సభ్యులు, విప్ లు, ఎమ్మెల్యేలు,
కరీంనగర్ కాంగ్రెస్ నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపిన వెలిచాల రాజేందర్ రావు
మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య..
మార్కెట్ కమిటీ చైర్మన్ కు వెల్లువెత్తిన అభినందనలు
తన నియామకానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు..
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అకుల నర్సయ్య, వైస్ చైర్మన్ గా సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్
నియమితులయ్యారు. మార్కెట్ కమిటీ సభ్యులుగా పంజాల శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేణి సంపత్, కసవేని భూమయ్య, మాలోతు మాలతి, శివనాధుని వెంకటేశ్వర్లు, పల్లా శివకుమార్‌ను
నియమించారు. అదేవిధంగా కరీంనగర్ పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. మార్కెట్ కమిటీ పాలవర్గ నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి నిప్ లు విజయ రమణారావు ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్ కోడూరు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ కాంగ్రెస్ నాయకుడు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంలో కీలక పాత్ర పోషించిన సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి రాజేందర్ రావు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలకవర్గం పనిచేయాలని రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కెట్ కమిటీ కమిటీగా తీర్చిదిద్దాలని రాజేందర్ రావ్ సూచించారు.
రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతా..
నిరంతరం రైతుల సేవకే ప్రాధాన్యం..
కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య..
తన నియమాకానికి సహకరించిన సీఎం పీసీసీ అధ్యక్షుడు మంత్రులు ఇతర నేతలందరికీ ధన్యవాదాలు.
రైతుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని కరీంనగర్ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి విప్ లు చింతకుంట విజయ రమణారావు ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్ కోడూరు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ కాంగ్రెస్ నాయకుడు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ తో పాటు ముఖ్య కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నిత్యం రైతుల సంక్షేమానికి పాటుపడతానని రైతుల సేవలో తరిస్తానని స్పష్టం చేశారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని ఆకుల నరసయ్య పేర్కొన్నారు. పంటల సాగు నుంచి దిగుబడి
ఇంటికి చేరి మద్దతు ధర వచ్చేవరకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
నూతన చైర్మన్ కు
అభినందనల వెల్లువ..
మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నియామకమైన ఆకుల నరసయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
తన నివాసంలో ఆకుల నరసయ్యకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు
ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు, ఉప సర్పంచ్ లు కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థులు ఆకుల నరసయ్యకు
పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
అకుల నర్సయ్య
తండ్రి : రాజమల్లు
తల్లి పేరు: మల్లమ్మ
DOB: 1970
పుట్టిన గ్రామం సుల్తానాబాద్
చదువు: ఇంటర్
కొడుకు: జశ్వంత్ పటేల్
కూతురు: సహస్రపటేల్
భార్య : ఆకుల నర్మద కార్పొరేటర్
1982లో రాజకీయ ప్రవేశం.
తెలుగుదేశం పార్టీలో చేరిక.
1996లో సుల్తానాబాద్ సింగిల్ విండో డైరెక్టర్ గా వైస్ చైర్మన్ గా పనిచేశారు.
2005లో సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ గా పనిచేశారు.
తెలుగుదేశం పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడిగా పనిచేశారు..
టిడిపి యువత నాయకుడిగా వ్యవహరించారు..
2005లో కరీంనగర్లో కార్పొరేటర్ గా పోటీ
2019లో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా నరసయ్య సతీమణి ఆకుల నర్మద గెలుపొందారు..
రెండవసారి 2026లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నరసయ్య సతీమణి ఆకుల నర్మద కార్పొరేటర్ గా విజయం సాధించారు..
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఆకుల నర్మద పోటీ చేశారు.
మొదటి నుంచి ఆకుల నరసయ్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రైతుల కష్టాలను దగ్గర నుండి చూసిన వ్యక్తి ఆకుల నరసయ్య. రైతు సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది.
సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రైతులకు అనేక సేవలందించారు. రైతు సమస్యలపై లోతైన అవగాహన ఉన్న నేతగా పేరుగాంచారు.
సహకార సంఘం డైరెక్టర్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆకుల
నరసయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించింది.