Take a fresh look at your lifestyle.

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏఐసీసీ కార్యదర్శి కమలాక్షి రాజన్

ముద్ర కూకట్‌పల్లి :
మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపుతో పాటు పదవులు లభిస్తాయని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కమలాక్షి రాజన్ పేర్కొన్నారు. సోమవారం కూకట్‌పల్లిలోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా కార్యకర్తల భారీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల కేటాయింపు.అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీ.చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు పార్టీ కట్టుబాటు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై కేసు నమోదైన నేపథ్యంలో, బండి సంజయ్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని బండి రమేష్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణలత, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ సునీత మహేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ కొలను హనుమంత రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ పుష్పారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
End

Leave A Reply

Your email address will not be published.