Take a fresh look at your lifestyle.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి చెందడం బాధాకరం..!

•గుండె పోటుతో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి.
•తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి,దోమ మాజీ జెడ్పిటిసి నాగిరెడ్డి.

పరిగి ముద్ర… దోమ మండల కేంద్రనీకి చెందిన ఈ. గోపాల్ గౌడ్ ( 56) గుండె పోటుతో గురువారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికీ లోనయ్యారు.గ్రామంలో పార్టీ కార్యక్రమలు, ఎలక్షన్స్ ఉన్న ముందుండి అహర్నిశలు పార్టీ కోసం నిరంతరం పాటుపడుతుందే వాడని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన మృతి పట్ల పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆయన మృతదేహానికి నీవాళ్ళు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య,మాజీ సర్పంచ్ రాజిరెడ్డి,మండల అధ్యక్షులు గోపాల్,వెంకటయ్య, బండి సాయిలు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.