ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: ఉత్కoఠ భరితంగా గురువారం జరిగిన ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది తొండపు వెంకటేశ్వర రావు గెలుపొందారు. ప్రత్యర్థి సుగ్గుల వెంకటేశ్వర రావు గుప్తా పై అయన 168 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉపాధ్యాక్షురాలిగా ఎం. విజయ శాంతి కేవలం ఆరు ఓట్ల అధిక్యంతో గెలిచారు. ప్రధాన కార్యదర్శి గా గద్దల దిలీప్ 39 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, కెవివి లక్ష్మీ 145 ఓట్ల మెజార్టీతో, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా విజయం సాధించారు. అలాగే గ్రంధాలయ కార్యదర్శిగా ఎస్ రాంబాబు 11 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోశాధికారి గా నర్సింహారావు, మహిళా న్యాయవాదుల ప్రతినిధిగా పోరిక ఇందిర ఏకగ్రీవమయ్యారు.