Take a fresh look at your lifestyle.

పూలే జీవితం అందరికీ ఆదర్శం -దేవినేని అరవింద రాయుడు.

ముద్ర, మోత్కూర్:
సంఘ సంస్కర్త దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికి సమాజంలో కుల వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం మనందరికీ ఆదర్శమని వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే మన అందరి కర్తవ్యం అని ప్రజాభారతి పూర్వ అధ్యక్షులు దేవినేని అరవింద రాయుడు అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని శనివారం మున్సిపల్ కేంద్రంలో ని గ్రంథాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముందుగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజా భారతి పూర్వ ప్రధాన కార్యదర్శులు తొగిటి మనోహరా చారి, మర్రి జయ శ్రీ, ఉపాధ్యక్షులు ఇ రాంప్రసాద్, వారాల యాదగిరి, తొర్ర ఉప్పలయ్య, గాదె వెంకటేశ్వర్లు, మోత్కూరు సుజాత, బయ్యని రాజు, కూరెళ్ళ యాకస్వామి, సజ్జనం మనోహర్, బాబు చారి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.