Take a fresh look at your lifestyle.

మెదక్ లో ఈట్ రైట్ వాక్ జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుని, శరీరానికి వ్యాయామాన్ని అందిస్తే
ఆరోగ్యకరమైన సమాజం తయారు చేయవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో సోమవారం ఉదయం పండుగ వాతావరణంలో ఈట్ రైట్ వాక్ నిర్వహించారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రతపై ప్రత్యేక దినోత్సవం సందర్బంగా హెడ్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి రాందాస్ చౌరస్తా వరకు వాకింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, ఎడ్యుకేషన్, ఫారెస్ట్, పోలీస్ స్పోర్ట్స్, ఇరిగేషన్, మత్స్యశాఖ, ఇండస్ట్రీస్ జిల్లా పరిషత్,వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సరైన ఆహారం ఆరోగ్య భవిష్యత్తు, ప్ల కార్డులు చేత బూని నినాదాలు చేస్తూ ప్రజలకు ఆవగాహన కల్పించారు. జిల్లాలోని ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు.
శారీరక ఆరోగ్యం కోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండి, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి సహజ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, 8న రక్షిత మాతృత్వ దినోత్సవం, 9న ఎయిడ్స్ నియంత్రణపై రెడ్ రన్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఏప్రిల్ 10న హోమియోపతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా కేజీబీవీల్లో, యోగా కేంద్రాల్లో యోగా సాధన చేయించాలని, అలాగే ఆయుష్ పై ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలి. 11న మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, డిసిహెచ్ డాక్టర్ శివ దయాల్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, అధికారులు జోజి, విజయ, హేమ భార్గవి,
శ్రీనివాసరావు, ప్రకాష్ రావు, రమేష్, మల్లేశం, మున్సిపాలిటీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు, ప్రజా ప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.