Take a fresh look at your lifestyle.

షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహం.. అంబేద్కర్ జయంతి నాడు ప్రతిభా పురస్కారాలు

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

షెడ్యూల్డ్ కులాలలోని విద్యార్థిని విద్యార్థులను ఉన్నత చదువులు చదివేల ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకాళి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులు పొన్నమల్ల రాములు తో కలిసి మాట్లాడారు. షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థిని విద్యార్థులై పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సొసైటీ ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అందులో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ పురస్కారాలు అందిస్తామని, ప్రతి విద్యార్థికి నగదు, ప్రశంసా పత్రం, భారత రాజ్యాంగ పుస్తకం విద్యార్థులకు ఇవ్వడంతో పాటు వారి కళ్యాణ్రులకు సన్మానం చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అన్ని వర్గాల షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులు 10 తేదీలోపు సొసైటీ సభ్యులను సంప్రదించాలని లేదా 9440494886, 9553681116, 9948653448 నంబర్లకు వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు పంపాలని సూచించారు. మంత్రి హరీష్ రావు సహకారంతో సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందని అప్పుడు చేకూర్చిన నగదును ఫిక్స్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులు నారాయణ, రామస్వామి, చంద్ర మోహన్, కనక మల్లయ్య, బిక్షపతి, సత్యనారాయణ లక్ష్మన్, సురేందర్, సాయి ప్రేమ్ , నరేష్ పలువురు పాల్గొన్నారు.

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.