ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
అభివృద్ధి,సంక్షేమం బిజెపి తోనే సాధ్యమని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం పార్టీ కార్యాలయం వద్ద నాయకులతో కలిసి జండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమే ప్రథమం అనే బలమైన సంకల్పంతో పనిచేసే కార్యకర్తలు కలిగిన పార్టీ బిజెపి మాత్రమే అన్నారు.చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కార్ పనిచేస్తుందన్నారు.యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందన్నారు.పేదల అభివృద్ధి,సంక్షేమ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్నారు.పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చేది కేంద్రమే అన్నారు.కరోనా కష్టకాలం నుండి ఇప్పటివరకు పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.కార్యక్రమంలో జిల్లా పదాధికారులు,నాయకులు మండల అధ్యక్షులు పాల్గొన్నారు