ముద్ర, ప్రతినిధి భువనగిరి :
మహిళల సమస్యల పరిష్కారానికి మహిళలందరూ ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు.
గురువారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డి గ్రామంలో ఐద్వా గ్రామ మహాసభ కొండ హైమావతి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐద్వా మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు ప్రజల పైన భారాలు మోపుతూ నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతూ పోవడం వల్ల పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అనంతరం 16 మందితో నూతన ఐద్వా గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా ఎడ్ల జ్యోతి, కార్యదర్శిగా కొండ హైమావతి, కోశాధికారిగా కొండమడుగు కావ్య, ఉపాధ్యక్షురాలుగా కొండమడుగు లక్ష్మీ, పిన్నింటి హేమలత, సహాయ కార్యదర్శులుగా మెరుగు మహేశ్వరి, బొల్లెపల్లి భాను కమిటీ సభ్యులుగా ఎడ్ల రామలీల, కొండ సుజాత, ఆకారం తులసమ్మ, కొండమడుగు మమత, కొండ మంగమ్మ, బొజ్జ లక్ష్మి, బబ్బురి ఉపేంద్ర, మెరుగు సుశీల, బొజ్జ అలివేలు ఎన్నికైనారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.