Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పథకాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించిన కలెక్టర్ ప్రతిమ

ముద్ర ప్రతినిధి,, మెదక్:
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తిలకించారు.


గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు  సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ఓ కే. రామచంద్ర రాజు, ఏపీఆర్ఓ బాబు రావులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నివేదిత నృత్యం


నివేదిత నృత్యం అలరించింది. నివేదిత నృత్యం వీక్షించిన కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా అధికారులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు అభినందించారు.
నివేదిత ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శన ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.