Take a fresh look at your lifestyle.

పట్నంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

  • వృద్ధురాలు మెడలో బంగారు గొలుసు చోరీ.

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: ఇబ్రహీంపట్నంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సినీఫక్కీలో వృద్ధురాలిని వెంబడించి ఆమె మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన మాదరమోని నర్సింహా భార్య లక్ష్మమ్మ (70) ఇబ్రహీంపట్నం కూరగాయల మార్కెట్ లో ఆకుకూరలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం ఆకుకూరలు విక్రయించి బస్టాండ్ కు బయలుదేరింది. ఆమె నడుచుకుంటూ వెళ్లే క్రమంలో ఓ దుండగుడు ఆమెను వెంబడించి ఆమె మెడలోంచి సుమారు 3 తులాల బంగారు గొలుసు చోరీ చేసి కారులో పారిపోయాడు. బాధితురాలు ఆమె భర్త ఈ ఘటన పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరికి పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.