ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్ళలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్ బీ, ఎస్ఎస్ సీ , బ్యాంకింగ్ రిక్రూట్ మెంట్ పరీక్షల కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ www.tgbcstudycircle.cag.gov.in ద్వారా ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అభ్యర్ధుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000/- , పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000/- మించకూడదని ఆయన తెలిపారు.
ఇంటర్మీడియట్ , డిగ్రీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ నియమం ప్రకారం అర్హులను ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు. అర్హత గల అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుంచి 14వ తేదీ వరకు ఉంటుందన్నారు. అన్ని బీసీ స్టడీ సర్కిల్ లలో 15 ఫిబ్రవరి నుండి ఆర్ఆర్ బీ, ఎస్ ఎస్ సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు.