- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉన్నదని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఏళ్ళవేళలా తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం పొన్నాల గార్డెన్స్ లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించి,జగిత్యాల జిల్లా కేంద్రంలో సీనియర్ సిటీజేన్స్ కోసం డే కేర్ సెంటర్ మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.జిల్లాలో సీనియర్ సిటీజేన్స్ కేసులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సత్వరం పరిష్కరిస్తున్న జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ను, సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తదితర సంఘ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి, నాయకులు దిండిగాల విఠల్, ఎం.డి.యాకూబ్, బత్తుల శంకర్, నాయిని సంజీవ రావు, ఎం.డి.ఇక్బాల్, పబ్బా శివానందం, వొజ్జల బుచ్చిరెడ్డి, బి.రాజేశ్వర్, కే.సత్యనారాయణ, కరుణ, విజయ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.