ముద్ర కాప్రా:
భారత జాతి, హిందూ ధర్మంపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల శ్యాముల్‌పై క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందూ మంత్రాలు, పూజారులపై అవమానకర వ్యాఖ్యలు చేసి మతపరమైన భావాలను కించపరిచారని, బిజెపి రాష్ట్ర నాయకురాలు పులుగు గిరుకబావి సురేఖ ఆరోపించారు తక్షణమే ఎమ్మెల్యే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సురేఖ డిమాండ్ చేశారు లేకుంటే ఆయనను తెలంగాణలో ఎక్కడ తిరగనివ్వకుండా అడ్డుకుంటామని సురేఖ హెచ్చరించారు.అసభ్యకర వ్యాఖ్యలు దుర్వినియోగ భాషను ఉపయోగించి మత సామరస్యాన్ని దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి నీ కోరారు. బిజెపి నాయకులు నిత్యానందు ,హేమంత్, మంజునాథ్, మహేష్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు