Take a fresh look at your lifestyle.

​విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలి: ఏబీవీపీ డిమాండ్

 

ముద్ర కూకట్‌పల్లి :
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యాశాఖకు కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది. మంగళవారం జేఎన్టీయూ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద భారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గళమెత్తారు.
​ముఖ్య డిమాండ్లు  విద్యా రంగానికి బడ్జెట్‌లో 15% వాటా కల్పించాలి. గత కొంతకాలంగా నిలిచిపోయిన స్కాలర్‌షిప్‌లు, ఫీ రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలి.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రాధాన్యత అంశాలుగా ప్రస్తావించి, పరిష్కారం చూపాలి.
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, విద్యా రంగం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని పేర్కొన్నారు. వేల సంఖ్యలో విద్యార్థులు ఫీ రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
​ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ నగేష్, స్టేట్ టెక్నికల్ సెల్ కన్వీనర్ పూజిత్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ రిషి, స్టేట్ యూనివర్సిటీస్ కో-కన్వీనర్ దుర్గా ప్రసాద్, మరియు జశ్వంత్, యశ్వంత్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.