గోదావరి జలాలను రంగారెడ్డి తీసుకువచ్చి సష్యాశ్యామలం చేస్తాం
-వికారాబాద్ జిల్లాను అంతర్జాతీయ టూరిజం చేస్తాం
-జిల్లాలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తాం
-రీజినల్ రింగు రోడ్డు, కృష్ణా రైల్వే లైను పూర్తి చేస్తాం
-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైన కేటాయిస్తామని రాష్ట ముఖ్య మంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణపూర్ లో “ ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభకు హాజరు అయ్యి ప్రజలను ఉద్దేశించి ముఖ్య మంత్రి మాట్లాడుతూ జిల్లాకు నీటి సౌకర్యాన్ని కల్పించే అవసరం ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కోట్ల రూపాయలత జిల్లాకు గోదావరి నీటిని ఖచ్చితంగా తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కాగ్నా నది ప్రాజెక్ట్ నిర్మాణం గావించి తాండూర్ ప్రాంత ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తానని తెలిపారు. ఎన్ని కోట్ల నిధులు కావాలంటే అన్ని నిధులను వెచ్చించి అయిన రోడ్ల నిర్మాణాల పనులను చేపడతామన్నారు. మూసి ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తె దాన్ని అడ్డుకునేందుకు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని ముఖ్య మంత్రి తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా 70 వేల ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. 9 వేల కోట్ల రూపాయలను మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇండ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వారికి ఆత్మ గౌరాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కుటుంబాలకు రేషన్ కార్డులను ఇచ్చి అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 6650 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి 567.69 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సాంకేతిక, జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బియ్యని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.