ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యుత్ సరఫారలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి అన్నారు. శనివారం వికారాబాద్ మండలం, జైదుపల్లి గ్రామంలో ప్రజబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యుత్ అధికారులు నేరుగా గ్రామానికి వెళ్లి విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం కోసం ప్రజాభాట కార్యక్రమం చేపట్టినట్టు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి చెప్పారు. ఇందులో భాగంగా జైదుపల్లి గ్రామంలో శనివారం చేపట్టిన కార్యక్రమంలో సీఈ బాలస్వామి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలతో గ్రామంలో తిరుగుతూ ఏమైనా లో ఓల్టెజ్ సమస్యలు. లూజ్ లైన్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న సమస్యలు అక్కడే విద్యుత్ సిబ్బందితో తక్షణమే పరిష్కరించారు. సమస్య పెద్దదిగా ఉంటే నోట్ చేసుకొని పరిష్కరించే దిశలో తగు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మా గ్రామం విద్యుత్ సమస్య ను గుర్తించి వారి గ్రామ పరిధిలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామ వాసులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. అంతరాయం లేకుండా విద్యుత్ అందించటమే తమ లక్ష్యమని ఇందులో భాగంగా ప్రజాబాట జరుపుతున్నట్టు సీఈ తెలిపారు. వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తేవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మౌనిక శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఈ రవి ప్రసాద్, డిఈ సంజీవ్, ఏడిఈ సత్యనారాయణ రెడ్డి, ఏఈ వేణుగోపాల్ రెడ్డి మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు…