ముద్ర ప్రతినిధి, జ్యోతి నగర్ (గోదావరిఖని): ఏకే మనోహర్ ఈ డి (ఓఎస్) రెడ్ (సౌత్) ఎన్ టి పి సి రామగుండం ను సోమవారం సందర్శించి, కార్యాచరణ పనితీరు క్లిష్టమైన సమస్యల పై సమీక్షించారు. ఆయన రామగుండం (ఈ ఎస్ పి ఆర్ అండ్ ) యూనిట్లు #2, #5 లను సందర్శించారు.తరువాత, ఆయన ఎన్టిపిసి మజ్దూర్ యూనియన్,ఎన్ టి పి సి ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ (నియర్), ఎన్ టి పి సి ఎస్/ సి ఎస్/టి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో కూడా సంభాషించారు. అలోక్ కుమార్ త్రిపాఠి, సిజిఎం (ఓ అండ్ ఎం) స్టేషన్ ఇన్-చార్జ్, ఎన్టిపిసి నుండి అందరు జనరల్ మేనేజర్లు,సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
