- మాజీ ప్రజాప్రతినిధులు శ్రీనివాస్ రావు, కిషన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి,జగిత్యాల : స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ కేటగిరికి కేటాయించిన స్థానాల్లో కేవలం జనరల్ అభ్యర్థులే పోటీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మపురి సింగిల్ విండో మాజీ చైర్మన్ కటారి శ్రీనివాస్ రావు, జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూ ఈ విషయంలో ఆర్డినేన్స్ తీసుకురావడానికి చేస్తున్న చర్యలను వారు అభినందించారు.సోమవారం శ్రీనివాస్ రావు, కిషన్ రెడ్డి లు మాట్లాడుతూ జనరల్ కు కేటాయించిన సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లో జనరల్ అభ్యర్థులే పోటీ చేసేలా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేసే ఆర్డినేన్స్ లో జనరల్ అభ్యర్థులకు కూడా ఆర్డినేన్స్ లో పొందుపర్చాలని సీఎం ను కోరారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు కేటాయించిన స్థానాల్లో ఆ సామాజిక వర్గం అభ్యర్థులు కాకుండా వేరే పంచాయతీ రాజ్ చట్టంలో పొందుపర్చగా ఇప్పుడు ప్రభుత్వం ఆర్డినేన్స్ తేనుండగా జనరల్ స్థానాల్లో వేరే సామాజిక వర్గాలు పోటీ చేయకుండా వారే పోటీ చేయడానికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రావు, కిషన్ రెడ్డిలు కోరారు.బీసీలకు 42 శాతం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలోనే చారిత్రాత్మకమని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేము వ్యతిరేకంకాదని చెబుతూ మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని వారు సీ ఎం ను అభ్యర్థించారు.