ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ 17వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి చెన్న స్వాతి మహేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం వార్డులో భారీ ర్యాలీతో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ 2023లో 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
