Take a fresh look at your lifestyle.

బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి…మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

భువనగిరి ఖిల్లాపై బిఆర్ఎస్ జెండా ఎగరాలి..
బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి…
పలు వార్డులలో భారీ ర్యాలీలో
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో భువనగిరి ఖిల్లా పై బిఆర్ఎస్ జెండా ఎగరాలని ఎగరవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం పట్టణంలోని 2, 5,17,18 వార్డుల బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకై భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ వార్డ్ అభ్యర్థి చింతల కిష్టయ్య, 5వ వార్డు అభ్యర్థి వాకిటి లతా కుమార్, 18 వ వార్డు అభ్యర్థి అందె శంకర్ ల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలుచుకుంటే భువనగిరి ఖిల్లాపై జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ కుమార్, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మండల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.