Take a fresh look at your lifestyle.

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని వినతి పత్రం అందజేత

 

 

ముద్ర …తుంగతుర్తి…

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షల ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం అసిస్టెంట్ సెక్రెటరీ కయీమ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తుంగతుర్తి ప్రాంతంలో సరైన వసతులు లేవనే సాకుతో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను వేరే ప్రాంతానికి తరలిస్తామంటే ఊరుకునేలేదని హెచ్చరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే స్పందించి పాఠశాలకు నూతన ప్రభుత్వ భవనాన్ని మంజూరు చేయాలని సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మల్లెపాక సాయిబాబా, తడకమళ్ళ రవికుమార్, గొపగాని రమేష్, నారాయణదాసు నాగరాజు, ఉప్పుల నాగమల్లు బొజ్జ సాయికిరణ్, సాయి కృష్ణ , మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.