Take a fresh look at your lifestyle.

శ్రీరామ ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ సస్పెండ్ ఏ డి ఏ రమేష్ బాబు

 

 

ముద్ర…. తుంగతుర్తి…
తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన శ్రీరామ ఫెర్టిలైజర్ షాపును సస్పెండ్ చేసినట్లు తుంగతుర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ బాబు తెలిపారు, శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూరియా అమ్మకాలను యాప్ ద్వారా బుక్ చేసిన తర్వాత అమ్మాలని నియమాల్ని పెట్టిన అట్టి నియమాలను అతిక్రమించి యాప్ లో బుక్ చేయకుండానే యూరియా అమ్మిన కారణంగా అతని లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు తెలిపారు, ఏ డీలర్ అయినా కానీ యూరియా యాప్ లో రైతులు బుక్ చేసుకున్న తర్వాతనే తన ఈపాస్ మిషన్ ద్వారా నమోదు చేసి రైతులకు విక్రయించాల్సి ఉంటుందన్నారు చాలామంది ఈ విధానాన్ని అమలు చేయకపోవడం సరికాదన్నారు ప్రతి దుకాణం యజమాని రికార్డులను సక్రమంగా మైంటైన్ చేయాలని స్టాక్ రిజిస్టర్ సరిపోయే విధంగా ఉండాలని తెలిపారు మందులను కూడా నమోదు చేసి ఉంచాలన్నారు లైసెన్స్ డీలర్ల వద్దనే పురుగు మందులను కొనుగోలు చేయాలని తెలిపారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా యూరియాను కానీ పురుగుమందులను కానీ విక్రయిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.