Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 

ముద్ర న్యూస్, ధర్మపురి:

ధర్మపురి పట్టణ కేంద్రంలోని స్థానిక హనుమాన్‌వాడలో మరియు బుద్దేశ్‌పల్లె గ్రామంలోని కడారి గంగాధర్ గారి నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గారు ఆయా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.