ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం మెగా క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను, కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో దివ్యాంగుల కోసం పెద్ద క్యాంప్ ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. దివ్యాంగ పిల్లల పోషణలో తల్లి తల్లిదండ్రుల పాత్ర గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, స్థానిక కౌన్సిలర్ గంజి రాజు, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, నారాయణ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు జింక సూరి, శ్రీరామోజీ నరేష్, అర్జున్, శశాంక్, సాత్విక్, తో పాటు పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.