మంథని, ముద్ర విలేఖరి : మంథని పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సిహెఏచ్ వెంకన్న ని బుధవారం మంథని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పక్షాన మంథని డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు గోటికారి కిషన్ జి ఆధ్వర్యంలో కమిషనర్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కిషన్ జీ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు సూచనలు, ఆలోచనల మేరకు మంథనిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మంథని పట్టణ సుందరీకరణ చేసి పట్టణ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు భీముని లింగయ్య గౌడ్, వంగల తిరుమలేష్, బూడిద తిరుపతి, సిరికొండ నాగయ్య, పూసాల బాలాజీ, కొమురోజు వేణు, ములుగోజు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.