Take a fresh look at your lifestyle.

కొత్తవి రావు… పాతవి పెరగవు…. ఆసరా కోసం ఎదురుచూపులు…

25 లక్షల దరఖాస్తులు పెండింగ్.. రెండెండ్లలో 2 లక్షల పెన్షన్లు రద్దు… ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న దరఖాస్తు దారులు….పట్టించుకోని అధికారులు…
ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం రెండెండ్లుగా పేదలు ఎదురుచూస్తున్నారు. కొత్తవి రావడం లేదు పాత పింఛన్లు పెరగడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిన ఆసరా చేయూత ముందుకు పడట్లేదు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి పింఛన్లు పెంచుతామని ప్రకటించింది, ప్రజా పాలన ద్వారా 2024- 25 రెండు దఫాలుగా కొత్తగా 24.85 లక్షల దరఖాస్తులను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు అర్హులను ఎంపిక చేయలేదు. పాత పింఛన్ల పెంపు కొత్త పింఛన్ల మంజూరు ఇప్పటి వరకు జరగలేదు దరఖాస్తు దారులు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. వివిధ కారణాలతో దాదాపు రెండు లక్షల పింఛన్లు రద్దు చేశారు. 2023-24 ప్రకారం 44,49 767 మంది ఆసరా పించన్ దారులు ఉన్నారు. వికలాంగులు, వృద్దులు, వితంతువులు, వ్యాధిగ్రస్తులు, గీత, చేనేత కార్మికులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఆసరా వికలాంగుల పింఛన్లను రూ,6016 కు మిగతా పింఛన్లు 4016 కు పెంచాలి అధికారంలోకి వచ్చి రెండెడ్లు గడుస్తున్న సర్కార్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది.
జీవో నంబర్ 17 ను తెరపైకి తెచ్చి ఆదాయ పరిమితి పేరిట పింఛన్లను తగ్గిస్తే సహించేది లేదు: టీ విఎచ్ఎస్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కనకబోయిన నాగరాజు ముదిరాజ్  జీవో నంబర్ 17 ను తెరపైకి తెచ్చి ఆదాయ పరిమితి పేరిట పింఛన్లను తగ్గిస్తే సహించేది లేదని అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లను ఇవ్వాల్సిందే అని విఎచ్ఎస్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కనకబోయిన నాగరాజు ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.