Take a fresh look at your lifestyle.

కాప్రా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర : కాప్రా

ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
కాప్రా డివిజన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించేందుకు సుమారు రూ.1.07 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా క్రింది పనులకు శంకుస్థాపనలు చేశారు, శ్రీ సాయి ఎన్‌క్లేవ్‌లో రూ.45 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణం,  శివా నగర్‌లో రూ.32 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ ,సాయిరామ్ నగర్, డిగ్నిటీ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు , ఈ పనులు పూర్తయ్యాక స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు బద్రుద్దీన్, ఇంద్రయ్య తో పాటు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.