Take a fresh look at your lifestyle.

సెలవులో కార్పొరేషన్ కమిషనర్.. ఇంచార్జ్ శ్రీజ మార్క్ పాలన

ఖమ్మం, ముద్ర విలేఖరి: ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సోమవారం నుంచి వ్యక్తిగత సెలవు పై వెళ్లారు. ఇన్చార్జిగా జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ప్రజావాణి తో పాటు కార్పొరేషన్ కు సంబంధించిన పలు సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. స్థానిక ప్రకాష్ నగర్ నుంచి కృష్ణమూర్తి అనే అర్జీదారుడు తమ ఇంటి పన్ను లో పేరు తప్పుగా ఉంది అది సరి చేయమని అర్జీ ఇవ్వగా అది సంబంధిత ఆర్ ఐ కు అందజేసి పరిశీలించి పరిష్కరించాలన్నారు. రాపర్తి నగర్ – 2 లో నివాసం ఉంటున్న ఏ .సత్యనారాయణ ఇంటి కి నీళ్ల కనెక్షన్ కి ప్రతి సంవత్సరం నీటి పన్ను కడుతున్న కూడా పెండింగ్ చూపిస్తున్నది ఒకసారి పరిశీలించి పన్ను అలా రాకుండా సరిచేయాలని చెప్పి అర్జీ ఇవ్వగా ఆ సమస్యను ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించి పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. శ్రీనివాసచారి బురాన్ పురం అద్దె ఇంట్లో ఒక గదిలో ఉంటున్న మాకు ఇద్దరు ఆడపిల్లలు మా కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా ఉంది గత ప్రజాపాలన కార్యక్రమంలో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని అర్జీ పెట్టుకున్నాము మొన్న మేము ఇంట్లో లేని రోజు ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి వచ్చారు అందువల్ల వెరిఫికేషన్ కాలేదు మరల మా ఇంటికి వెరిఫికేషన్ కి పంపించగలరని అర్జీ ఇవ్వగా వెంటనే పరిష్కరించాలని ఆర్ ఓ కు అందజేశారు. ఆధార్ ఇతర గుర్తింపు కార్డు అన్నిటిలో పేరు ఓట్ల సీతమ్మ అని ఉందని గత మార్చిలో జారీ చేసిన ఇంటి పనులు కట్ల సీతమ్మగా తప్పు నమోదు అయింది అర్జీని సంబంధిత ఆర్ ఐ కు అందజేసి వెరిఫికేషన్ చేయాలన్నారు. పలు ఫిర్యాదులను మంగళవారం ఆమె పరిష్కరించారు. 16వ డివిజన్ బృందావనంలో రెండు వెంచర్లు కలుపుతూ రాకపోకలు వీలుగా ఉండే రోడ్డులో కాలువ తీసి వెళ్లడానికి వీలు లేకుండా ఉన్నది అని కంప్లైంట్ రాగా తక్షణమే స్పందించిన కమిషనర్ ఆ సమస్య ఏంటో చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశించారు. వారు స్పందించి ఆ రెండు వెంచర్స్ మధ్యలో తీసినటువంటి కాలువను పూడ్చి రాకపోకలకు అనువుగా చేశారు. ఇంకో అర్జీదారుడు 54 డివిజన్లో రోడ్డు ఆక్రమించి షెడ్ నిర్మించారని కంప్లైంట్ రాగా స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ షెడ్ ను తొలగించారు. గతంలోనూ ఆమె ఇన్చార్జిగా పనిచేయగా పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఉదయం 10:30 గంటల వరకే కార్యాలయాన్ని చేరుకొని ఆఫీస్ పనులు చక్కబెడుతున్నారు. దీంతో కార్పొరేషన్ కింద స్థాయి సిబ్బంది సైతం ఆలస్యం చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.