- జిల్లా జర్నలిస్టుల తరుపున 5 లక్షల ప్రమాద భీమా రుసుము చెల్లించిన కార్తీక్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు ప్రమాద భీమాకు యువ నేత,రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి 3 లక్షల చెక్కును అందజేశారు.స్వర్గీయ ఇంద్రారెడ్డి ట్రస్ట్ తరుపున మంగళవారం జరిగిన జిల్లా మహాసభలో ఈ చెక్ ను యూనియన్ మాజీ జాతీయ అధ్యక్షులు దేవుల పల్లి అమర్,జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి, కోశాధికారి వెంకట్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు విరహత్ అలీ,రామనారాయణ,కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,ముఫిసిల్ కమిటీ చైర్మన్ పేపర్ శ్రీనివాస్ తదితరులతో కలిసి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి లను జర్నలిస్ట్ నాయకులు,సభ్యులు అభినందించారు. గతంలోను ఈ విధంగా సహకరించి,పలు నియోజకవర్గ పాత్రికేయులకు ప్లాట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.భవిష్యత్తు లోను జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి ప్రకటించారు.
