• ప్రారంభించిన బాల నటుడు మాస్టర్ రేవంత్
• మే 4 వరకు కొనసాగనున్న చాక్లెట్ పండగ
• 25 నుంచి 27 వరకు కోకోమిలన్ యాక్టివిటీస్
ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: హైదరాబాద్ లులు మాల్‌లో చాక్లెట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్న “లులు బిగ్ చాకో డేస్” ఫెస్టివల్‌ను బాల నటుడు మాస్టర్ రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం ఫేం) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్టర్ రేవంత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే పెద్దదైన లులు హైపర్‌మార్ట్‌ను తొలిసారి సందర్శించి ఈ ఫెస్టివల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు తనను ఆహ్వానించిన లులు మాల్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చాక్లెట్ ప్రియులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. తర్వాత రకరకాల చాక్లెట్లను పరిశీలించారు.
బహుమతులు గెలుచుకునే అవకాశం..
లులు బిగ్ చాకో డేస్‌లో సన్‌ఫీస్ట్ కంపెనీ ఉత్పత్తులు కనీసం రూ.199 విలువైనవి కొనుగోలు చేసిన వారు ఐప్యాడ్ గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. కొనుగోలు సమయంలో వినియోగదారులకు కూపన్లు అందించి లక్కీ డ్రా ద్వారా విజేతలకు బహుమతులు అందజేస్తారు. అలాగే కనీసం రూ.300 విలువైన స్నికర్ గెలాక్సీ ఉత్పత్తులు కొనుగోలు చేసిన వినియోగదారులు గిఫ్ట్ వోచర్స్ (రోజుకి ముగ్గురు) గెలుచుకోవచ్చు. మే 4వ తేదీ వరకు ఈ చాక్లెట్ ఫెస్టివల్ కొనసాగనుండగా.. చాక్లెట్ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లోనే తొలిసారిగా..
తర్వాత మాల్‌లో నిర్వహిస్తున్న “కోకోమిలన్ యాక్టివిటీ”ని సైతం రేవంత్ ప్రారంభించారు. అక్కడికి పిల్లలతో సరదగా కాసేపు గడిపి వారితో ఫొటోలు దిగారు. హైదరాబాద్‌లోనే తొలిసారిగా చిన్న పిల్లల కోసం ఇలాంటి యాక్టివిటీ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేసవిలో చిన్నపిల్లల ఫన్ యాక్టివిటీస్‌కు లులు మాల్ చిరునామాగా నిలుస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పిల్లలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మాల్‌ను సందర్శించి ఆనందించాలని పిలుపునిచ్చారు.
3 రోజుల పాటు వినోదం
ఈ నెల 27 వరకు జరిగే ఈ కోకోమిలన్ వేడుకలో కోకోమిలన్ కార్టూన్ క్యారెక్టర్ జేజే, అతని స్నేహితుల పాత్రలతో చిన్నారులను అలరించనున్నారు. పిల్లలకు వినోదంతో పాటు విద్య కూడా నేర్చుకునేలా ప్లాన్ చేశారు. పెయింటింగ్, డ్రాయింగ్, త్రీడీ యానిమేషన్ చిత్రాలు, వీడియోలతో ఇంగ్లీష్ పద్యాలు, పాటలు నేర్పిస్తారు.
కొన్ని రోజుల క్రితమే తరగతుల్ని పూర్తి చేసుకుని సెలవుల మూడ్‌లో ఉన్న పిల్లలకు ఈ కోకోమిలన్ ఫెస్టివల్ ఒక పండగలా మారనుంది. ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులకు ఉపశమనం లభించేలా.. తమకెంతో ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లతో ఆనందించే అవకాశాన్ని హైదరాబాద్ లులు మాల్ కల్పిస్తోంది. ఈ సదావకాశాన్ని చిన్నారులంతా సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదీర్ షేక్ కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ మహమ్మద్ షరీఫ్, జనరల్ మేనేజర్ విమేష్, లులు ఇతర అధికారులు పాల్గొన్నారు.