Take a fresh look at your lifestyle.

అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  • ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.కలెక్టరేట్లో మహిళా అబివృద్ది, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో పోషణ అభియాన్ పథకం ద్వారా పోషణ పక్షం – పోషణ జాతర, అంగన్ వాడి కేంద్ర పిల్లల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లతాతో కలసి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడి ప్రీ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎంతో చురుకుగా ఉంటారని అన్నారు.జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు చాలావరకు అద్దె భవనాల్లో, మౌలిక సదుపాయాలు సమస్య తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేసి అంగన్వాడి కేంద్రాకు కొత్త భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.పోషణ పక్షం–పోషణ జాతర కార్యక్రమన్ని నిర్వహించిన జిల్లా సంక్షేమ అధికారి డా.భోనగిరి నరేష్ ను, సిబ్బందిని అభినదించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పోషణ పక్షోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నందు పోషణ జాతర నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా పోషణకు సంబంధించి వివిధ స్టాల్ ఏర్పాటు చేసి బాలమృతం, పోషక ఆహార పదార్థాల స్టాల్ ఏర్పాటు చేసి సామాజిక వేడుకలలో భాగంగా సీమంతం,అక్షరభ్యాసం,అన్న ప్రసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓలు మమత, వాణిశ్రీ, వీరా లక్ష్మి మణెమ్మ డిసిపిఓ హరీష్, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.